భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (Indiramma Housing) త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla ilaiah) అన్నారు. ఈ రోజు జిల్లాలోని మూటకొండూరు మండలంలోని వర్టూరు గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని దళిత వాడలో సుమారు 25 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు (Indiramma house titles) పంపిణీ చేశారు. వారి ఇళ్లకు భూమిపూజ చేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
