ముందుకా, వెనక్కా..?

ముందుకా, వెనక్కా..?
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: టారిఫ్‌ల విషయంలో భారత్‌పై కఠినంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. టారిఫ్ గేమ్ అనుకున్నంత సానుకూలంగా లేకపోవడంతో డ్యామేజ్ కంట్రోల్‌కు దిగుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో భారత్‌పై కఠినమైన వ్యాఖ్యలు చేసిన ట్రంప్, ఇప్పుడు సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు సంకేతాలు పంపడం దీనికి నిదర్శనం.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటన దీనికి మరింత బలం చేకూరుస్తుంది. భారత్-అమెరికా సంబంధాలు సరికొత్త ఎత్తులకు చేరుకుంటున్నాయని, ఆర్థిక సంబంధాలలో అద్భుతమైన అవకాశాలను గుర్తించామని ఆయన వ్యాఖ్యానించారు. సుంకాలను అడ్డుపెట్టుకుని భారత్‌తో తెగిన దౌత్య సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తున్నట్లు ఈ పరిణామాలను బట్టి తెలుస్తోంది.
గతంలో, ట్రంప్ భారత్‌పై “టారిఫ్‌లతో తమని చంపేస్తున్నారని” ఆరోపించారు. తమ వస్తువులపై సుంకాలు ఉండవని ఢిల్లీ అంగీకరించిందని, అయినా భారత్ తమ వస్తువులపై 50 శాతం టారిఫ్‌లు విధించిందని ఆయన ఘాటుగా విమర్శించారు. అయితే, నైజం లేని ట్రంప్ మాటలను భారతీయులు ఎప్పుడో నమ్మడం మానేశారు. ఈ తాజా పరిణామాలు భవిష్యత్తులో రెండు దేశాల సంబంధాలు ఏ మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి.
