మాదాపూర్ : హైదరాబాద్ ( Hyderabad) లోని మాదాపూర్ ప్రాంతం మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. అక్రమ సరోగసి, ఎగ్ ట్రేడింగ్ ముఠా గుట్టు రట్టయింది. రెండు ఫెర్టిలిటీ కేంద్రాల్లో (two fertility centers) నిబంధనలు ఉల్లంఘిస్తూ జరుగుతున్న ఈ కార్యకలాపాలపై పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ (Police, Medical and Health Department) సంయుక్తంగా దాడులు నిర్వహించి కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో తల్లి-కొడుకు అరెస్టు కావడం, అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా అనుబంధాలు బయటపడడం కలకలం రేపుతోంది. డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను ఎంచుకున్న తల్లీ కొడుకులు (Mother and son) ఎగ్ డోనర్, సరోగసి మదర్ గా ఒప్పందాలు చేసి డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. లక్ష్మి రెడ్డి మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్నారు.

Leave a Reply