- క్రికెట్.. ఇక ప్రపంచ క్రీడ
ప్రతిష్టాత్మక టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న దక్షిణాఫ్రికా, ఇప్పుడు క్రికెట్ చరిత్రలో మరో అద్భుత ఘనతను తన పేరుపై లిఖించుకుంది. లార్డ్స్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి 2023–25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న దక్షిణాఫ్రికా, క్రికెట్లో ఐసీసీ ప్రపంచ టైటిల్‌ను గెలిచిన ఐదవ ఖండానికి చెందిన జట్టుగా నిలిచింది.
క్రికెట్ – గ్లోబల్ గేమ్ గా మారిన క్షణం!
దీంతో క్రికెట్ అనేది ప్రపంచంలోని అన్ని ఖండాలకు చెందిన జట్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన ఏకైక క్రీడగా మారింది. అయితే, ఈ ఘనత మరే మిగతా అంతర్జాతీయ క్రీడా విభాగం చేరలేదు. ప్రపంచంలోని ఎక్కువ దేశాల్లో ప్రాచుర్యం పొందిన ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, రగ్బీ లాంటి ఆటలకే ఈ స్థాయి విస్తరణ సాధ్యం కాలేదు. ఉదాహరణకు, ఫుట్‌బాల్ ఫిఫా వరల్డ్ కప్ ఇప్పటివరకు కేవలం యూరోప్ & దక్షిణ అమెరికా దేశాలకే పరిమితమై ఉంది. ఈ నేపథ్యంలో, క్రికెట్ మాత్రం ప్రతి ఖండం ప్రతిభను గుర్తించి, చాంపియన్లను పుట్టించగలిగిన ఏకైక ఆటగా నిలిచింది.
ఖండాల వారీగా ఐసీసీ టైటిల్స్ గెలిచిన జట్లు:
ఆసియా :
భారతదేశం: 1983 (ODI), 2007 (T20), 2011 (ODI), 2013 (CT)
పాకిస్తాన్: 1992 (ODI), 2009 (T20), 2017 (CT)
శ్రీలంక: 1996 (ODI), 2014 (T20)
ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా : మొత్తం 7 టైటిల్స్ (ODI, T20, WTC)
యూరోప్
ఇంగ్లాండ్: 2010 (T20), 2019 (ODI), 2022 (T20)
అమెరికాస్ (కరేబియన్)
వెస్టిండీస్: 1975, 1979 (ODI), 2004 (CT), 2012, 2016 (T20)
ఆఫ్రికా
దక్షిణాఫ్రికా: 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ✅
దక్షిణాఫ్రికా విజయంతో… క్రికెట్ నేడు సరిహద్దులు లేని ఆటగా మారింది. ఈ విజయం కేవలం ఒక జట్టు విజయం కాకుండా క్రికెట్ ప్రపంచ విజయానికి ఒక మైలురాయిగా నిలిచింది.