ఉప సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం

చాకలి మహేష్‌ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఉప సర్పంచుల హక్కుల కోసం పోరాడాలి..
పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి: జాజాల సురేందర్

తాడ్వాయి, ఆంధ్రప్రభ : జిల్లా ఉప సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కంకల్‌ గ్రామానికి చెందిన చాకలి మహేష్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఘనంగా సన్మానించారు. తాడ్వాయిలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో మహేష్‌కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా జాజాల సురేందర్‌ మాట్లాడుతూ.. మహేష్‌ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఉప సర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడాలని, ఉప సర్పంచులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మైలారం రవీందర్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, మండల మాజీ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు ఎల్మ రవీందర్‌రెడ్డి, తాడ్వాయి సొసైటీ చైర్మన్‌ కపిల్‌రెడ్డి, సర్పంచ్‌ మంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.