భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి..

చెన్నూర్, ఆంధ్రప్రభ : నాగుల పంచమి వేడుకలను మహిళా భక్తులు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణమాసం తొలి సోమవారం, నాగుల పంచమి ఒకే రోజు కలిసి రావడంతో స్థానిక శివాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాగుల పుట్ట వద్ద పాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పూజలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.