ప్రజావాణిలో రెండు దరఖాస్తులు

నాంపల్లి, ఆంధ్రప్రభ: మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమం సోమవారం నాంపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లి గ్రామానికి సంబంధించిన సమస్యలపై రెండు దరఖాస్తులు అధికారులకు అందాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తుదారులు ఎంపీడీవోకు వినతిపత్రాలు సమర్పించారు.

ప్రజల నుంచి నేరుగా సమస్యలను స్వీకరించి సంబంధిత శాఖల అధికారుల ద్వారా పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.