ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటా..

  • చేసేదే చెబుతా చెప్పింది చేస్తా
  • ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
  • పేదల సొంతింటి కల నెరవేర్చిన ఎమ్మెల్యే తాతయ్య
  • 768 టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేత
  • పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు గృహాలు పంపిణీ

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : ఇచ్చిన హామీకి కట్టుబడి దాన్ని నెరవేర్చిన తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్యకు టిడ్కో గృహాల లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని బలుసుపాడు రోడ్డులోని టిడ్కో గృహ సముదాయంలో ఫేజ్‌-1 కింద నిర్మించిన 768 గృహాల లబ్ధిదారులకు ఆగస్టు 15న ఇంటి తాళాలు అందజేస్తానని ఎమ్మెల్యే తాతయ్య రెండు నెలల క్రితం హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చేందుకు అధికారులతో నిరంతరం మాట్లాడి, పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

768 మంది పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ వారి గృహాల తాళాలను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య, జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మున్సిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర అందజేశారు. ఈ సందర్భంగా గృహ సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ యువనేత శ్రీరాం ధనుంజయ్‌ చినబాబు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీరాం సుబ్బారావు, మున్సిపల్‌ అధికారులు, గృహ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మున్సిపల్‌ కమిషనర్‌, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చెప్పిందే చేస్తా.. ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటా

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ చేసేదే చెప్తాను.. చెప్పింది చేస్తాను అన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని, హామీని నెరవేర్చేందుకు వంద శాతం కృషి చేస్తానని తెలిపారు. తాను చెప్పినట్లుగానే ఆగస్టు 15న ఫేజ్‌-1లోని లబ్ధిదారులకు గృహాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగినట్లు చెప్పారు.

పనులు వేగవంతంగా జరిగేలా అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశామని, నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించినట్లు తెలిపారు. పేదవాడి సొంతింటి కలను నిజం చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినట్లు వివరించారు.

మొత్తం 768 మంది లబ్ధిదారుల్లో 144 మందికి ఇళ్లను పూర్తిగా ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. మిగిలిన లబ్ధిదారులకు రుణాల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని, దాన్ని కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గృహ సముదాయంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి

జగ్గయ్యపేట నుంచి గృహ సముదాయం వరకు రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తాగునీటి కోసం కృష్ణా జలాలను అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. వీధి దీపాలు, రక్షణ, భద్రతతోపాటు ఇతర మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామన్నారు. విద్యుత్‌ మీటర్ల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పేదలందరికీ సొంతిల్లు లక్ష్యం

నెట్టెం రఘురాం మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గృహ నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు.

మున్సిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర మాట్లాడుతూ సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు చెప్పారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీరాం సుబ్బారావు, టీడీపీ యువనేత శ్రీరాం ధనుంజయ్‌ చినబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌రావు, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నూకల కుమార్‌రాజా, తెలుగునాడు అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికారిక సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, ఎల్‌ఎస్‌సీఎస్‌ సొసైటీ చైర్మన్‌ ధూళిపాల లక్ష్మణరావు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు, టిడ్కో అధికారులు, కౌన్సిలర్లు కర్ల శాంతకుమారి జోజి, కన్నెబోయిన రామలక్ష్మి, గింజుపల్లి వెంకట్రావు, ఇర్రి నరసింహారావు, గొట్టే నాగరాజు, పేరం సైదేశ్వరరావు, సంగేపు బుజ్జిబాబు, నగిరికంటి వెంకట్‌, టీడీపీ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, గృహాల లబ్ధిదారులు పాల్గొన్నారు.