13 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో బోధన చేసేందుకు 13 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరైనట్లు ఉరవకొండ ఎంఈవో ఈశ్వరప్ప తెలిపారు. మంజూరైన పోస్టుల్లో రెండో తరగతి ఉపాధ్యాయుల పోస్టులు 5, సబ్జెక్ట్ సహాయకుల పోస్టులు 8 ఉన్నట్లు పేర్కొన్నారు. బీఎడ్, టీటీసీ పూర్తి చేసి, టెట్ అర్హత సాధించిన వారు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు. ఈ నెల 16 నుంచి 21వ తేదీలోపు దరఖాస్తులను విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు రెండు సెట్ల చొప్పున ఉరవకొండలోని ఎంఆర్‌సీలో అందజేయాలని ఎంఈవో సూచించారు.