Tollywood Movies 2027 | టాలీవుడ్లో అప్పుడే మొదలైన సందడి!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండగ అంటే సినిమాల పండగ కూడా. టాలీవుడ్లో ఈ పండగ సీజన్‌కు సినిమాల మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే సంక్రాంతికి ఇంకా చాలా సమయమే ఉన్నా.. పండగకి సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలపై ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది. పలువురు స్టార్ హీరోలు, దర్శకులు తమ చిత్రాలను సంక్రాంతి లక్ష్యంగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు పండగ బరిలో ఉంటాయని ప్రకటనలు రాగా, మరి కొన్ని సినిమాలు మాత్రం బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం సంక్రాంతి రేసులో వెంకీ–అనిల్ ఐదో చిత్రం, కళ్యాణ్ రామ్–అనిల్ రెండో చిత్రం పండకే వస్తున్నట్లు ప్రకటించగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా జార్జ్ క్రిష్ చిత్రం ఇటివలే షూటింగ్ ప్రారంబించుకుంది. అయితే ఈ సినిమాను సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయిధరమ్ తేజ్ హీరోగా వస్తున్న ‘సంబరాల ఎట్టి గట్టు’ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా కూడా సంక్రాంతికి రానున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని భారీ చిత్రాలు కూడా సంక్రాంతి విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
మరిన్ని సినిమాలు.. రేసులోకి వచ్చే అవకాశం
ఇక అధికారిక విడుదల తేదీల ప్రకటన రావాల్సిన చిత్రాల జాబితాలో ‘మహాకాళి’, ‘చిరు–బాబీ రెండో చిత్రం’, ‘కింగ్ 100’, ‘వీరాధి వీరులంతా’వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని చిత్రాలు సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
స్టార్ హీరోల సినిమాలతో ఆసక్తికరంగా పోటీ
సంక్రాంతి సీజన్లో పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే థియేటర్ల వద్ద పోటీ సహజంగానే పెరుగుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలతో పాటు విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలు కూడా బరిలోకి వస్తే ప్రేక్షకులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఈసారి సంక్రాంతి రేసు ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇప్పటి నుంచే నెలకొంది.
ప్రస్తుతం వినిపిస్తున్న సినిమాల జాబితాను బట్టి చూస్తే.. సంక్రాంతి బరిలోకి దిగేందుకు టాలీవుడ్ ఇప్పటి నుంచే రెడీ అవుతోంది.** అయితే ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? ఎవరు అధికారికంగా సంక్రాంతి తేదీలను ప్రకటిస్తారు? అనేది మాత్రం రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.
