గుర్రపు డెక్క తొలగింపు…
పెడన – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా పెడన నియోజవర్గం పెడన మండలం సాయిరాజ్ కాలువ పంట కాలువలో తూడు, గుర్రపుడెక్క, నాచు, తొలగిస్తున్న రైతులు ఆయకట్టు రైతుల కోరిక మేరకు శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాలతో దావోజిపాలెం బ్యాంక్ ప్రెసిడెంట్ కాగిత నాగేశ్వరావు సహకారంతో ఈ పనులు ఆదివారం ముమ్మరంగా సాగుతున్నాయి.
దాదాపు 3కిలోమీటర్ల మేర గుర్రపు డెక్క నాసు పట్టేసింది. తాగునీరు, సాగునీరు రాక రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ దృష్టికి రైతులు తీసుకువెళ్లగా వెంటనే స్పందించి పిఎసిఎస్ అధ్యక్షులు కాగిత నాగేశ్వరావుకు వెంటనే కాలువలో పనులు చేపించాలని తెలిపారు. పీఏసీఎస్ అధ్యక్షులు నాగేశ్వరావు ఈ విషయంపై స్పందించి కాలువలో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు పనులు వేగవంతంగా కూలీలతో చేయిస్తున్నారు.
