రాజవరంలో పీఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభం..
- ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి
చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం రాజవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన పీఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్‌ను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
నూతన కన్వెన్షన్ హాల్ స్థానిక ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేలను నిర్వాహకులు శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుపూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
