జాఫర్గూడెం కాంగ్రెస్ గ్రామ కమిటీకి ఘన సన్మానం
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం జాఫర్గూడెం గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ గ్రామ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కుర్ర రాజేష్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా శాగ గట్టయ్య, ప్రధాన కార్యదర్శిగా కోడెల రాజు, కోశాధికారిగా కన్నారపు బుచ్చయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కొత్త కరుణాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, జిల్లా నాయకుడు కోళ్ల రవి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి, కంచనపల్లి పీఏసీఎస్ డైరెక్టర్ కావటి భాస్కర్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాగ సురేష్, ఉపసర్పంచ్ కావటి రవి, వార్డు సభ్యులు శాగ శ్రీనివాస్, తోకల లక్ష్మి, బద్దుల సురేష్, సిద్ధగోని వెంకటరమణ, సిద్ధగోని రాజు, శాగ నరేష్, కన్నారపు కృష్ణ, కుడికాల లింగరాజు, కోడెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
