Vijayawada | పడమటలంక రైతుబజార్ వద్ద ఘటన..

మూడు బైక్‌లు, గుడ్ల వ్యాన్‌ను ఢీకొట్టి డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు
బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్‌పై కాలు వేయడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం
ఘటనాస్థలికి చేరుకున్న పడమట పోలీసులు.. దర్యాప్తు ప్రారంభం


Vijayawada | (విజయవాడ, ఆంధ్రప్రభ) : విజయవాడ పడమటలంక రైతుబజార్ వద్ద ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు మూడు ద్విచక్ర వాహనాలతో పాటు గుడ్ల వ్యాన్‌ను ఢీకొట్టి అనంతరం డివైడర్‌పైకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారు నడుపుతున్న వ్యక్తి బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌పై కాలు వేయడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం.

అయితే ప్రమాదానికి అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పడమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను పరిశీలించారు. వాహనాలను పక్కకు తరలించే చర్యలు చేపట్టి, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.