పంచముఖ ఆంజనేయ స్వామికి త్రివర్ణాభిషేకం..
కరీమాబాద్, ఆంధ్రప్రభ: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ శివనగర్‌లోని శ్రీ సీతారామస్వామి దివ్య క్షేత్రంలో కొలువైన పంచముఖ ఆంజనేయ స్వామికి శనివారం త్రివర్ణాభిషేకం నిర్వహించారు. మువ్వన్నెల జెండా రంగుల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీ సీతారామచంద్రస్వామి, క్షేత్రపాలకుడైన పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు భండారు ప్రసాద్ శర్మ, భండారు చంద్ర ప్రసాద్ శర్మ, భండారు జయశంకర్ ఆధ్వర్యంలో వేద పండితులు త్రివర్ణాభిషేకాన్ని నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ట్రస్ట్ అధ్యక్షుడు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
