తాడ్వాయి–పస్రా రహదారిపై ఘోర ప్రమాదం

లారీ–కారు ఢీ.. భార్యాభర్తలు మృతి

తాడ్వాయి, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా తాడ్వాయి మండలం పస్రా–తాడ్వాయి ప్రధాన రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడ్వాయికి సమీపంలోని కొండపర్తి మూలమలుపు వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు మృతి చెందారు. ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతులను వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.