రేగొండ మండలంలో స్వాతంత్య్ర వేడుకలు
వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
మహనీయుల త్యాగఫలమే స్వాతంత్య్రం
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ పతాకావిష్కరణ
జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న తహసీల్దార్ శ్వేతారావు
రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండలంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ గ్రామపంచాయతీల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వారణాసి మౌనిక, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్వేతారావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై దాసరి సుధాకర్, పీఏసీఎస్‌లో చైర్మన్ నడిపల్లి విజ్జన్‌రావు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
అలాగే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఆయా పార్టీ అధ్యక్షులు పున్నం రవి, బండి శ్రీనివాస్, అంకం రాజేందర్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. మండలవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.
