ఉత్తమ సేవలకు ప్రశంసలు..

  • ఎంపీడీవో ఉమర్ షరీఫ్‌కు ప్రశంసాపత్రం, షీల్డ్

జన్నారం, ఆంధ్రప్రభ : ఉత్తమ సేవలు అందించినందుకు మంచిర్యాల జిల్లా జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్‌కు ప్రశంసాపత్రం, షీల్డ్ లభించాయి. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రం, షీల్డ్ అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి కిషన్ పాల్గొన్నారు.

ఎంపీడీవో ఉమర్ షరీఫ్‌ను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇసాక్, పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర నందునాయక్, ప్రధాన కార్యదర్శి మణిక్యం తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ఉమర్ షరీఫ్ మాట్లాడుతూ ఉద్యోగరీత్యా చేసిన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించడం సంతోషంగా ఉందన్నారు.

అటవీ శాఖ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు

జన్నారం అటవీ డివిజన్ పరిధిలో పలువురు ఉద్యోగులకు ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసాపత్రాలు, షీల్డ్‌లు అందజేశారు. తాళ్లపేట, జన్నారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పి. మమత, స్పెషల్ డ్యూటీ సెక్షన్ ఆఫీసర్ కృష్ణారావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రహిమోద్దీన్, సీనియర్ అసిస్టెంట్ క్రాంతిలకు ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, ఎఫ్‌డీపీటీ శాంతారాం, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, షీల్డ్‌లు అందుకున్నారు. జన్నారంలో ఎఫ్‌డీఓ రామ్మోహన్ చేతుల మీదుగా ఫారెస్ట్ సెక్షన్, బీట్ అధికారులు హన్మంతరావు, ఎం. శంకర్, ఎ. నరేష్, మంగ, జ్యోతి, డి. రాజేశ్వర్‌తో పాటు పలువురు ఉద్యోగులు నగదు పురస్కారాలు అందుకున్నారు.