మహనీయుల త్యాగఫలమే స్వాతంత్ర్యం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్‌రెడ్డి

నాంపల్లి, ఆంధ్రప్రభ : ఎందరో మహనీయుల పోరాటం, త్యాగఫలంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్‌రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కత్తి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, నాంపల్లి ఉప సర్పంచ్ పానుగంటి నిర్మల వెంకటయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీ పంతు నాయక్, గిరి వెంకటయ్య, వడ్లకొండ రమేష్ యాదవ్, బుషిపాక అరుణ, హరి ప్రసాద్ నాయక్, మార్కెట్ డైరెక్టర్ పూల యాదగిరి, చాంద్ పాషా, సుదర్శనచారి, గాదేపాక నాగరాజు, బేగరీ గిరి, సుంకిశాల సర్పంచ్ కలకొండ దుర్గయ్య, బత్తుల వంశీ తదితరులు పాల్గొన్నారు.