ఉత్తమ ఏఎస్ఐ అవార్డు అందుకున్న వెంకట్రావు
బిక్కనూర్, ఆంధ్రప్రభ : బిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న వెంకట్రావుకు ఉత్తమ ఏఎస్ఐ అవార్డు లభించింది. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హనుమంతరావు చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత వెంకట్రావు మాట్లాడుతూ.. అవార్డు రావడంతో తనపై మరింత ఉద్యోగ బాధ్యత పెరిగిందన్నారు.
ఇకపై కూడా అంకితభావంతో విధులు నిర్వహిస్తానని తెలిపారు. ఉత్తమ ఏఎస్ఐగా అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వెంకట్రావుకు అవార్డు లభించడంపై స్థానిక సీఐ నరేష్, ఎస్ఐ అనిల్‌తో పాటు పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
