ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు..
ఏటూరునాగారం, ఆంధ్రప్రభ: ఏటూరునాగారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అఫ్టల్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, అనంతరం జర్నలిస్టులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా అఫ్టల్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వెంకన్న, అలువాల శ్రీనివాస్, జూపాక కృష్ణ, లాలయ్య, బోడ సత్యం, ఎండీ అత్తర్ బాషా, నూతి ప్రణయ్, ఠాగూర్, శ్రీను, రవి తేజ తదితర మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
