ఉత్తమ ఉద్యోగిగా జుక్కల్‌ ఎంపీడీఓ

  • కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం
  • ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు గుర్తింపు
  • ఎంపీడీఓకు అభినందనలు తెలిపిన ప్రజాప్రతినిధులు, ప్రజలు

జుక్కల్‌/కామారెడ్డి, ఆంధ్రప్రభ : జుక్కల్‌ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) బి. శ్రీనివాస్‌ ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రం అందుకున్నారు. జుక్కల్‌ మండలంలో ఎంపీడీఓ బి. శ్రీనివాస్‌ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సంక్షేమ పథకాల అమలులో చురుకుగా పనిచేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు ఈ గుర్తింపు లభించింది. ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన ఎంపీడీఓ శ్రీనివాస్‌కు జుక్కల్‌ మండల ప్రజాప్రతినిధులు, ప్రజలు అభినందనలు తెలిపారు.