ఆరేపల్లి ప్రజలకు సర్పంచ్‌ స్రవంతి శుభాకాంక్షలు

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సందేశం
సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది: సర్పంచ్‌ స్రవంతి

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఆరేపల్లి గ్రామ ప్రజలకు సర్పంచ్‌ పాతరాబోయిన స్రవంతి రాజు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతి, కుల, మత భేదాలు లేకుండా అందరూ జరుపుకునే గొప్ప పండుగ స్వాతంత్య్ర దినోత్సవమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలు, విద్యార్థులు, కార్మికులు, రైతులు, మహిళల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

ప్రజలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని విధంగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సర్పంచ్‌ స్రవంతి రాజు అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రభుత్వం పలు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.