నందనం సొసైటీలో స్వాతంత్య్ర వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన మార్నేని రవీందర్‌రావు
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి

హనుమకొండ, ఐనవోలు, ఆగస్టు 15 (ఆంధ్రప్రభ): ఐనవోలు మండలం నందనం సొసైటీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నందనం సొసైటీ చైర్మన్‌, మాజీ టిస్కాబ్‌ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మార్నేని రవీందర్‌రావు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న సమసమాజ స్థాపన, దేశ ప్రగతి కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో సొసైటీ వైస్‌ చైర్మన్‌ చందర్‌రావు, గ్రామ సర్పంచ్‌ రోజా, వార్డు సభ్యులు, వర్ధన్నపేట సొసైటీ చైర్మన్‌ రాజేష్‌ కన్నా, సీఈఓ సంపత్‌, సొసైటీ డైరెక్టర్లు సంపత్‌రావు, బుచ్చిరెడ్డి, మెట్టె చిరంజీవి, రాజారపు కుమార్‌, బిర్రు పద్మ, కలకోటి ఎలేంద్ర, చింతబాబు తదితరులు పాల్గొన్నారు.