కోర్టులో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జడ్జి ధీరజ్ కుమార్
- స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి
- దేశ సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తొర్రూరు డివిజన్ కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ధీరజ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జడ్జి ధీరజ్ కుమార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వీరులు, అమరులందరికీ నివాళులర్పిస్తున్నామని అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. వెంకటరత్నం, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామ్‌రెడ్డి, ఏజేపీ శ్రీను, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
