ఐడీఓసీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హన్మకొండ (ఆంధ్రప్రభ బ్యూరో): భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని ఐడీఓసీ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్పాయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
