చిట్యాల మండలంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

చిట్యాల (ఆంధ్రప్రభ): చిట్యాల మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు.

గ్రామ పంచాయతీలో సర్పంచ్ లక్ష్మి, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వసంతరావు, ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక అధికారి వాల్య నాయక్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. వివిధ రాజకీయ పార్టీలు, యువజన సంఘాల ఆధ్వర్యంలోనూ జాతీయ జెండాలను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు.