స్వచ్ఛ ఘంటసాలగా తీర్చిదిద్దడమే లక్ష్యం…

పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ ప్రారంభం
మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు


ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. ఘంటసాల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సంపద సృష్టికేంద్ర సమీపంలో వ్యర్ధాలు పడవేయకుండా స్వచ్ఛతకు ఆనవాళ్లుగా నిలిపేందుకు ప్రత్యేకంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. లోపలి భాగంలో రబ్బిస్ వేసి మొక్కలు పెంచేందుకు అనువుగా తీర్చిదిద్దారు.

ఈ ఫెన్సింగ్ ను శనివారం ఎంపీపీ వేమూరి రజిని కుమారి, ఎంపీడీవో సుబ్బారావు, శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్ లు ప్రారంభించి మొక్కలు నాటడం జరిగింది. ఎంపీపీ రజనీకుమారి మాట్లాడుతూ… ఘంటసాల గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్ మాట్లాడుతూ… గతంలో ఈ రహదారి వెంబడి ప్రాంతాలను పడదేసేవారని, పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి టి.జయలక్ష్మి, పిఎసిఎస్ అధ్యక్షులు బండి పరాత్పరరావు, వైసీపీ నాయకులు వేమూరి ప్రవీణ్, గొర్రెపాటి సురేష్, మండల పరిషత్ కార్యాలయం ఉద్యోగులు, వెలుగు ఉపాధి, హామీ పథకం సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.