ఎర్రకోటపై త్రివర్ణ పతాకం.. ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాకారాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్రివర్ణ పతాకం రెపరెపలాడిన దృశ్యంతో ఎర్రకోట పరిసరాలు దేశభక్తి భావంతో నిండిపోయాయి.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎర్రకోట వేదికగా సైనిక దళాల గౌరవ వందనం, జాతీయ గీతం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేశ ఐక్యత, అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలపై ఈ సందర్భంగా ప్రధానంగా దృష్టి సారించారు.