ప్రపంచ సెయిలింగ్ పోటీల్లో పతకం సాధించిన రిశ్వితకు ఘన సన్మానం
యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అభినందనలు.. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
కామారెడ్డి జిల్లా, బిక్కనూర్ (ఆంధ్రప్రభ): ప్రపంచ సెయిలింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన రిశ్వితను యూత్ క్లబ్ సభ్యులు ఘనంగా అభినందించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం రిశ్వితను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా యూత్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన రిశ్విత ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొని పతకం సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రిశ్వితకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో యూత్ క్లబ్ ప్రతినిధులు లింబాద్రి, మహిపాల్ రెడ్డి, వెంకట సుబ్బారావు, ఆర్టీసీ లక్ష్మీనారాయణ గౌడ్, జనార్దన్ రెడ్డి, మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, భూమయ్య, భరత్ కుమార్, రాజేందర్, దయాకర్ రెడ్డి, సాయిలు, రామచంద్రం, గ్రామ సచివాలయ వార్డు సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
