నిత్యాన్నదాన పథకానికి రూ.2.02 లక్షల విరాళం
దాతలను అభినందించిన ఆలయ ఈవో
ద్వారకాతిరుమల, ఆంధ్రప్రభ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో స్వామివారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు భక్తులు వేర్వేరుగా విరాళాలు అందజేశారు. మంగళగిరికి చెందిన దామెర్ల వెంకట నరసింహ నాగమణి దంపతులు రూ.1,01,116 విరాళంగా అందించగా, పశ్చిమగోదావరి జిల్లా మాగొల్లుకు చెందిన పెన్మత్స సత్య వేంకట సుబ్రహ్మణ్యరాజు రూ.1,01,116 విరాళం అందజేశారు.
శుక్రవారం ఆలయానికి చేరుకున్న దాతలు ముందుగా స్వామివారి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కార్యాలయంలో విరాళాల మొత్తాన్ని జమ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, సూపరింటెండెంట్ ఐ.వి. రామారావు దాతలను ప్రత్యేకంగా అభినందించారు. వారికి విరాళ బాండ్ పత్రాలతో పాటు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్వామివారి నిత్యాన్నదాన పథకానికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

