పీఆర్‌టీయూ ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఎన్నిక..

కడెం, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం పీఆర్‌టీయూ టీఎస్‌ సంఘంతోనే సాధ్యమని నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు తోట నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి బి.వి. రమణారావు అన్నారు.

కడెం మండల కేంద్రంలో నిర్వహించిన మండల శాఖ కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా ఉపాధ్యాయులకు అనేక సౌకర్యాలు కల్పించడంలో పీఆర్‌టీయూ సంఘం కీలక పాత్ర పోషించిందని తెలిపారు.

రానున్న రోజుల్లో సీపీఎస్‌ రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు, అందరికీ ఆమోదయోగ్యమైన వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సాధన కోసం తమ సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

అనంతరం నిర్వహించిన కడెం మండల పీఆర్‌టీయూ శాఖ ఎన్నికల్లో తోట నరేంద్రబాబు, బి.వి. రమణారావు ప్యానల్‌ ఘన విజయం సాధించింది.

కడెం మండల పీఆర్‌టీయూ నూతన అధ్యక్షుడిగా బొమ్మిడి మహేశ్వర్‌, ప్రధాన కార్యదర్శిగా బోయిని వెంకటరమణ ఎన్నికయ్యారు. అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఎం. దామోదర్‌, మహిళా అసోసియేట్‌ అధ్యక్షురాలిగా వనిత, ఉపాధ్యక్షులుగా గంగారం, జ్యోతి, కార్యదర్శులుగా చిట్టేటి నరేష్‌, ఓం సాయి, మహిళా కార్యదర్శులుగా విద్యాలత, సాయిరాణి ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు కోట వేణు, ఎన్నికల పరిశీలకుడు గబ్బాయి శంకర్‌, ఎన్నికల అధికారులు, సీనియర్‌ నాయకులు రమేష్‌, దశరథ్‌, ప్రేమదాస్‌, గణేష్‌, లక్ష్మీనరసయ్య, చిలివేరి వెంకటరాములు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.