హర్ ఘర్ తిరంగా ర్యాలీ.. మూడు చక్రాల బైక్ నడిపిన ఎంపీ శబరి
దివ్యాంగులకు అండగా నిలిచిన వైనం
నందికొట్కూరులో త్రివర్ణ హోరు వేలాది విద్యార్థులతో ఎంపీ శబరి భారీ ర్యాలీ
ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి దివ్యాంగులతో కలిసి బైక్ ర్యాలీలో ఎంపీ బైరెడ్డి శబరి
నందికొట్కూర్, ఆగస్టు 14 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరు పట్టణంలో జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో శారీరక వైకల్యాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా దివ్యాంగులు ఉత్సాహంగా జాతీయ జెండాలతో పాల్గొనడం సంతోషంగా ఉందని వారిని ఉత్సాహపరుస్తూ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మూడు చక్రాల బైక్‌ను స్వయంగా నడిపారు.
పలు విద్యాసంస్థల నుండి భారీగా తరలివచ్చిన విద్యార్థులతో కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మూడు రంగుల జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులను ఉత్సాహపరుస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ నంద్యాల రోడ్డు మీదుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సెంటర్ వద్దకు చేరుకుని పటేల్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయగీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా మూడు రంగుల జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాలను చాటాలని పిలుపునిచ్చారు.

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని, యువతలో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ జెండా పట్ల గౌరవాన్ని చాటాలని స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నాగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి టీడీపీ నాయకులు మురళీధర్ రెడ్డి రఘురామిరెడ్డి గుణశేఖర్ రెడ్డి, బంగారు వెంకటేశ్వర్లు, ఆంధ్ర ప్రగతి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు, వికలాంగుల సంఘం నాయకులు మాదాసి ఎల్లప్ప విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
