సేవా కార్యక్రమాలు చేయడమే ఆదివాసి మిత్ర సొసైటీ ధ్యేయం
- జిల్లా కోఆర్డినేటర్ ఆడ వెంకటేష్
జైనూర్, ఆంధ్రప్రభ : ప్రముఖుల సహకారంతో సేవా కార్యక్రమాలు చేయడమే ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ ధ్యేయమని ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆడ వెంకటేశ్ అన్నారు. గురువారం సిర్పూర్ (యు) మండలంలోని పిట్టగూడ లింగాపూర్ మండలాల్లోని రావునూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు ఆ సొసైటి ఉపాధ్యక్షురాలు ఆడ గౌతమి ఆధ్వర్యంలో టీ షర్ట్లు, కిట్లు, ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ సొసైటీ ద్వారా సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలునిర్వహిస్తున్నామని తెలిపారు.
యంగ్ ఇండియా ఫౌండేషన్, హైదరాబాద్కు చెందిన పూనం అగర్వాల్, పూజా లల్వాని, జయంతి మేడం, అర్జున్ కెడియా, పర్ద్ గుప్తా గార్లసహకారంతోవిద్యార్థులకు స్టేషనరీ కిట్లు, టీ-షర్ట్లు, షర్ట్లు , స్టీల్ ప్లేట్లు అందజేశామని అదేవిధంగా హైదరాబాద్కు చెందిన విశ్వేశ్వర రావుసహకారంతో బోరోప్లస్సబ్బులు,వ్యాసిలీన్లు, జండూ బామ్లను కూడా పంపిణీ చేశామని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు చదువుతోపాటు పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఆనక దేవేందర్, మాడావి, శ్రీనివాస్, పిట్టగూడ సర్పంచ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
