దస్తూరాబాద్ లో హర్ గర్ తిరంగా ర్యాలీ..

దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : దస్తూరాబాద్ మండల కేంద్రంలో పీఎం నరేంద్ర మోడీ పిలుపు అనుసారం బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు పానుగంటి రాజు ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగా ర్యాలీ నీ బీజేపీ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మండల కేంద్రం లో మానవహారం నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ… భారతీయ పౌరులందరూ జాతీయ జెండాను గౌరవించాలని విదేశీ వస్తువులను కొనుగోలు చేయకుండా స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చుంచు రాజేందర్, నాయకులు గంగాధర్, సత్యం, రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.