ఉచిత మెగా వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..

  • మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు, సర్పంచ్ కొడప ప్రకాష్

జైనూర్, ఆంధ్రప్రభ : ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు కోసం ఏర్పాటు చేస్తున్నఉచిత మెగా వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు అన్నారు. గురువారం జైనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శ్రీ గణేష్ ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో స్థానిక జైనూర్ ఆసుపత్రి వైద్యాధికారి నాగర్ గోంజ్ అశోక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్, లింగాపూర్ సర్పంచ్ జాదవ్ రాజశేఖర్, వైద్యాధికారి ఉదయ్ కిరణ్, గణేష్ హాస్పిటల్ ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ ప్రసాద్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటేనే మనిషి తాను చేసే పని పై పూర్తి దృష్టి సారించే అవకాశముంటుందని ఆ దిశలో ఆరోగ్యం పై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కంటి పరీక్షలు చేయించి వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఉద్యోగులు ప్రజలు పాల్గొన్నారు.