మూల మలుపు వద్ద కారు ప్రమాదం
సిరికొండ, ఆంధ్రప్రభ : గత రాత్రి గం. 11 : 00 ప్రాంతంలో. టిఎస్ 8 ఎఫ్.వై 9150 నంబర్ గల కారు అద్భుతప్పి పొలలోకి దూసుకు వెళ్లడంతో ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. సిరికొండ నుంచి భీంగల్ వెళ్లి రహదారి మధ్యలో రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఎక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడం వల్ల. తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా న్యావనంది తాళ్ల వద్ద మూలమలుపు 200 గజాల దూరంలో మరో మూలమలకు అతి ప్రమాదకరంగా ఉన్నాయి.
మూలమలుపులు ఉన్నట్లు ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనందున. కారు ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. వాహనదారులు ఎందరు ప్రమాదాలకు గురైనప్పటికీ రోడ్లు భవనాల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్పిస్తే, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదానికి గురైన కారు ముచ్కూర్ గ్రామ వాసిగా తెలిసింది. నాట్లు వేసిన పొలంలోకి కారు దూసుకు వెళ్లడంతో పొలంలో గల బురద వల్ల. కారు సురక్షితంగా ఉండడానికి కారణంగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డట్టు సమాచారం.
