రాచాపూర్ సర్పంచ్ కు బీఆర్ఎస్ నాయకుల పరామర్శ..

లక్ష్మణచాంద, ఆగస్ట్ 13, ఆంధ్రప్రభ : లక్ష్మణ్ చందా మండలం రాచాపూర్ గ్రామ సర్పంచ్ ముత్యం అనారోగ్యంతో బాధపడుతుండడంతో నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ రామ్ కిషన్ రెడ్డి, మండల బీఆర్ఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి, పీచరా మాజీ సర్పంచ్ భూమేష్, పోట్టపల్లి నరేష్ ప్రసాద్, పండరి తదితర పార్టీ నాయకులు ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా నాయకులు సర్పంచ్ ముత్యం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.