భార్యతో గొడవ.. కత్తితో యువకుడి ఆత్మహత్యాయత్నం
తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు..
అపస్మారక స్థితిలో 26 ఏళ్ల యువకుడు
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యతో జరిగిన గొడవతో ఓ యువకుడు కత్తితో తనకు తానే గాయపర్చుకున్న ఘటన బుట్టాయిగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
కవిరి బానుప్రసాద్ (26), తండ్రి నర్సయ్యగా గుర్తించినట్లు సమాచారం. భార్యతో గొడవ అనంతరం కత్తితో తనకు తానే గాయపర్చుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బానుప్రసాద్‌ను 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
