తిరుపతమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలోని హుండీల కానుకల లెక్కింపు కార్యక్రమం మంగళవారం ఆలయ బేడ మండపంలో నిర్వహించారు. హుండీల ద్వారా భక్తులు వేసిన కానుకలు రూ. కోటి 24 లక్షల 23, 463ల ఆదాయంగా సమకూరిందని అలాగే మిశ్రమ బంగారం 34 గ్రాములు, వెండి 520 గ్రాముల వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి లీల కుమార్ తెలిపారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ శెట్టి పర్యవేక్షణ నిర్వహించగా ఈ లెక్కింపు కార్యక్రమంలో మాజీ తిరుపతమ్మ దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు చెంచు రమేష్ బాబు ఆలయ అధికారులు నాయి బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు.
