హోరాహోరీగా క్రీడా పోటీలు
మోత్కూర్, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు అరవింద్ రాయుడు క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసం పెంపొందుతుందని అన్నారు. విద్యార్థి జీవితంలో చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటరమణ, ఉపాధ్యాయులు అంజయ్య, రాంప్రసాద్, వెంకటయ్య, రవీందర్, లలితకుమారి, మంజుల, రవికుమార్, విమలమ్మ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
