వైభవంగా శివపార్వతుల మాస కల్యాణం
మునుగోడు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని శ్రీ ప్రాచీన శివరామక్షేత్రాలయంలో మాస శివరాత్రి సందర్భంగా మంగళవారం శివపార్వతుల మాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
సర్పంచ్ పాలకూరి రమాదేవి, నరసింహగౌడ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొండోజు నవీన్‌కుమార్ శిష్యబృందం ఆధ్వర్యంలో కల్యాణ తంతు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
