కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలి

మోత్కూర్, ఆంధ్రప్రభ : కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని డిఫెన్స్ వినియోగదారుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు గుమిడెల్లి పరశురాములు డిమాండ్ చేశారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాన్ని అన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని కోరారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని, ఈ దేశంలో ప్రతి పేదవాడు గౌరవంగా జీవిస్తున్నారని అన్నారు.

త్వరలోనే రాష్ట్రపతి, ప్రధాని, ఆర్బీఐ గవర్నర్‌కు వినతిపత్రాలు అందించడంతో పాటు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కూరెళ్ల సైదులు, మండల ఇన్‌చార్జి పల్లె నవీన్, విద్యార్థి రాజకీయాల పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల నరేష్, కామ్రేడ్ మల్లెబోయిన అంజయ్య, పల్లపు సమ్మయ్య, గ్రామీణ పేదల సంఘం అధ్యక్షుడు రుద్రపెళ్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.