సమాచార హక్కు బోర్డులు ఏర్పాటు చేయాలని తహశీల్దార్‌కు వినతి

మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం సమాచార హక్కు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బీసు భాష ఆధ్వర్యంలో తహశీల్దార్ జ్యోతికి వినతిపత్రం అందజేశారు.

ప్రజలకు ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కల్పించేందుకు సమాచార హక్కు చట్టం-2005పై అవగాహన కల్పించే బోర్డులను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

సమాచారం కోసం వచ్చే దరఖాస్తుదారులకు సరైన సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బీసు భాష, ప్రతినిధులు నోముల వెంకన్న, లోడి రవికుమార్ పాల్గొన్నారు.