AP | షాపు రూముల లీజుకు వేలం ప్రకటన ఆపివేయాలి..

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్


AP | ఉరవకొండ రూరల్, ఆగస్టు 11 (ఆంధ్రప్రభ): ఉరవకొండ పట్టణంలోని శ్రీ గవిమఠ సంస్థానం షాపు రూముల లీజుకు వేలం ప్రకటన ఆపివేయాలని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. శ్రీ గవిమఠ సంస్థానంకు చెందిన సర్వేనెంబర్ 473, 475, 480 ఈ 2, 479/జె 2 మరియు 515లోని షాపులు 284, బిల్డింగులు 22, మండపంలు 8కి సంబంధించి శ్రీ గవిమఠం సంస్థానం సహాయ కమిషనర్ అండ్ మేనేజర్ సుధారాణి పేరుతో వేలం ప్రకటన ఇచ్చారు.

ఉరవకొండ శ్రీ గవిమఠ సంస్థానంకు చెందిన భూములు ఎంత విలువైనవని, ఈ భూములు వేలం వెయ్యడానికి వీలులేదని, వేలం ప్రకటనను వెంటనే ఆపివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.