సీసీ రోడ్డు కల్వర్టు పనులు చేపట్టాలని ఎంపీడీవోకు వినతి
వర్షాకాలంలో ఇబ్బందులు.. సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి
ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అవుసలోనిపల్లి గ్రామం ఒకటో వార్డు మెయిన్ రోడ్డు నుంచి సీసీ రోడ్డు, కల్వర్టు పనులు చేపట్టాలని కోరుతూ పలువురు నాయకులు మంగళవారం ఎంపీడీవో పావనికి వినతిపత్రం సమర్పించారు.
ఒకటో వార్డు నుంచి పీర్ల మసీదు వరకు సీసీ రోడ్డు, కల్వర్టు ఏర్పాటు చేయాలని కోరారు. వర్షాకాలంలో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎంపీడీవోను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి తిమ్మయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
