మెరుగైన వైద్యం కోసం ఎల్‌ఓసీ పత్రాల అందజేత

భవానిపురం, ఆంధ్రప్రభ: మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో మంజూరైన ఎల్‌ఓసీ పత్రాలను కూటమి నాయకులు బాధిత కుటుంబాలకు అందజేశారు. కొత్తపేటకు చెందిన గంధా నూకారత్నం (49)కు రూ.6.50 లక్షలు, ఊర్మిళ నగర్‌కు చెందిన ఎన్‌.వెంకట రమణ (45)కు రూ.6.83 లక్షల విలువైన ఎల్‌ఓసీ పత్రాలను అందించారు. హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్స కోసం ఈ సాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.