గండ్రాయిల వైకాపా పార్టీలో చేరికలు
పార్టీలో చేరిన వారిని పార్టీ కండవాలకు ఆహ్వానించిన తన్నీరు
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గండ్రాయి గ్రామానికి చెందినవారు చేరారు. సోమవారం పార్టీలో చేరిన వారికి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన టిడిపి చెందిన వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. ప్రజల తరఫున నిలబడి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ నిరంతరం ముందుకు వెళ్తున్న వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో పలువురు వైకాపా పార్టీలో చేరినట్లు తెలిపారు.
గండ్రై గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు అమరబోయిన రవి దుండగుల సత్యనారాయణ టిడిపి పార్టీ వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గండ్రాయి గ్రామ పార్టీ అధ్యక్షుడు దమ్మలపాటి సత్యనారాయణ జిల్లా అధికార ప్రతినిధి చెంతకుంట్ల వెంకటరెడ్డి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
