Breaking news | వ్యాన్ కాలువలో పడి… 9 మంది మృతి…
మధ్యప్రదేశ్‌లో విషాదం..
ముమ్మరంగా సహాయక చర్యలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్‌గఢ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. కాలువలో పడిపోయిన వ్యాన్‌ను గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
