ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి వాహనం అడ్డగింత

వరుణ యాగం సందర్భంగా ప్రోటోకాల్ రగడ
భద్రతా సిబ్బందితో వాగ్వాదం.. ఉన్నతాధికారుల ఆదేశాలతో వాహనం పంపింపు

నాగార్జునసాగర్, ఆంధ్రప్రభ : నాగార్జునసాగర్ విజయ విహార్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ రగడ చోటుచేసుకుంది. వరుణ యాగం సందర్భంగా వీవీఐపీ గ్యాలరీ వైపు వెళ్తున్న ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి వాహనాన్ని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.

నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జిల్లా వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వాహనాన్ని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాన్ని వీవీఐపీ గ్యాలరీ వైపు పంపించారు.

ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.